Friday, November 17, 2017

అందరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ?

          సిర్పూర్ నియోజక వర్గం లో ఉత్కంట పెల్లుబిల్లుతుంది. 2019 నియోజక వర్గ ఎన్నికల్లో ఇప్పటినుండే పోరు మొదలైందని అర్థమౌతుంది. గత నెల రోజుల నుండి ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా పోరాటాన్ని చేస్తున్నారు. ఒకరు ప్రజల వద్దకు పాలనా తేవాలి అంటే ఇంకొకడు పూర్తి రాజకీయాలని మార్చాలని. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన మేనిఫెస్టో ని పట్టుకుని తిరుగుతున్నారు.

         ప్రస్తుత MLA కోనేరు కోనప్ప కి కాస్త పని భారం ఎక్కువ అయిందని తెలుస్తుంది. అన్ని చోట్ల తిరుగుతున్నారు. అందరిని కలుపుకు పోవాలన్నా ఉత్సాహం ఎన్నడు లేనిది ఇప్పుడు మొదలైందని సామాజిక వర్గాల ఆరోపణ.  
         ఒక వైపు అందరి దృష్టిని తన వైపుకి ఆకర్సించేందుకు పాల్వాయి హరీష్ తనదైన శైలిలో నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పకనే చెప్పారు. తను డిసెంబర్ 6 వ తేదిన నియోజక వర్గ ప్రజల కొరకు ప్రజా వైద్య శాల ప్రారంభిస్తానని చెప్పారు.

Wednesday, December 17, 2014

మనిషికి మనిషికి మానవత్వం లేదా?


ఆటపాటలతో సందడి సందడిగా ఉండాల్సిన పెషావర్‌, పాకిస్తాన్ లోని ఆర్మీస్కూల్  మొన్న ఉదయం 10 గంటలకి రక్తసిక్తమైంది. పిల్లల ఆట పాటలు, కేరింతలు క్షనంలో మాయమయ్యాయి. మాటలతో చెప్పలేని మారణహోమం అది. ఏడుగురు పాకిస్తాన్ తాలిబన్ ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో స్కూల్‌లోకి చొరబడ్డారు. 1500 మంది తో ఉన్న ఆర్మీ స్కూల్, ఎంతో ఆహ్లాదకరంగా ఉండి  నిత్యం తన కన్నా తల్లి ఒడిలో సేద తిరుతున్నట్టుగా ఉంటుంది. 

ఉగ్రవాదులు విద్యార్థులను దొరికినవాళ్లను దొరికినట్టు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ప్రతి తరగతి గదికి వెళ్లి వెతకిపట్టుకుని మరీ కాల్చి చంపారు. కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులను బందీలుగా చేసి కవచంగా పెట్టుకొన్నారు. ఒక ఉపాధ్యాయురాలిని కుర్చీలో కూర్చోబెట్టి మరీ సజీవ దహనంచేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 132 మంది చిన్నారులను బలిగొన్నారు. అంతా 15 ఏళ్లలోపు వాళ్లు. పొద్దున యూనిఫాంలో బడికి వెళ్లిన వాళ్లు- కొన్ని గంటల వ్యవధిలోనే శవపేటికలోకి ఒరిగిపోయారు. స్కూల్ బ్యాగ్తో వెళ్లిన పాప- నెత్తుడి ముద్దలా మారి తల్లి చేతుల్లోకి వచ్చిన దృశ్యం -రాక్షసుడి చేత కూడా కంటనీరు తెప్పిస్తుంది! ఎంత పాశవికంగా అంటే.. వెంటాడి వేటాడి మరీ కాల్చి చంపారు! ప్లీజ్ అంకుల్ అని కాళ్లుపట్టుకుని బతిమాలారు! అయినా రాక్షసులు వదల్లేదు! గుక్కపట్టి ఏడుస్తూ చిట్టిచేతులు దండంపెట్టి వేడుకున్నారు! దుర్మార్గులు కనికరించలేదు! కాళ్లుపట్టి పైకిలేపి తుపాకీ గుండెకి గురిపెట్టి ఒక్కవేటుతో నేల రాల్చారంటే- వాళ్ల గుండె ఎంతటి పాషాణమో అర్ధం చేసుకోండి! లైన్లో నిలబెట్టి మరీ కాళ్లమీద తూటాల వర్షం కురిపించారు. తలమీద బానెట్ పెట్టి ట్రిగ్గర్ నొక్కితే పదుల సంఖ్యలో బుల్లెట్లు చీల్చుకుంటూ వెళ్లాయి. ఛాతీ మీద గురిపెట్టి కాలిస్తే గుండెను బుల్లెట్లు జల్లెడలా మార్చాయి.




ఆ ఉగ్రవాదుల్లో నలుగురు తమను తాము పేల్చుకోవడంతో.. ఆ ధాటికి పదుల సంఖ్యలో విద్యార్థులు మృత్యువాత పడ్డారు.!పెడరెక్కలు విరిచి గాల్లో ఎగరేసి పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు! రూమ్ రూమ్‌కీ వెళ్లి వెతికిపట్టుకొని మరీ చంపారు . పసివాళ్ల ఆర్తనాదాలు, ఆక్రందనలు సైతానుల గుండెల్ని కరిగించలేదు. సరస్వతీ నిలయంలో నెత్తుటి ఏరులు పారాయి! రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని చనిపోతున్న పిల్లల్ని చూసి ఉన్మాదులు పైశాచికానందంతో కరాళ నృత్యం చేశారు. చిన్నారుల దేహాలను చిల్లులు చిల్లులుగా చేస్తూ -తుపాకులతో సాగించిన మారణకాండ సుమారు తొమ్మిది గంటలపాటు సాగింది. పదేండ్ల కిందట రష్యాలో చెచెన్ రెబల్స్ 330 మంది చిన్నారులను పొట్టనబెట్టుకొన్న తర్వాత- పసిమొగ్గలపై ఆ స్థాయిలో దాడి జరుగడం ఇదే తొలిసారి.

మాటలకందని ఉన్మాదం. ఊహకందని రాక్షసత్వం. గుండె ముక్కలయ్యే కర్కశత్వం. పాషాణ హృదయమైనా కరిగి నీరై ప్రవహించే దారుణం! ఉగ్రోన్మాదం తలకెక్కి పిచ్చికుక్కల్లా మారి పసివాళ్లను పొట్టన పెట్టుకున్న మారణహోమం! 

స్కూల్లో కాల్పులు మొదలైన వెంటనే ఆర్మీ అధికారుల అలర్టయ్యారు. పాఠశాల పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. వందల సంఖ్యలో ఆర్మీ కమాండోలు మోహరించారు. సుమారు ఎనిమిది గంటలపాటు ఉగ్రవాదులు, ఆర్మీ మధ్య భీకరయుద్ధం జరిగింది. ఆ తర్వాత మిగిలిపోయిన ఉగ్రవాదులను కూడా హతమార్చి.. ఆర్మీస్కూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. మొత్తం 15 పేలుళ్లు జరిగాయి. మొత్తం 132 మంది విద్యార్థులు.. 9 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు.గాయపడిన 130 మందిలో 118 విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది, ఏడుగురు ఎస్‌ఎస్‌జీ సైనికులు, ఇద్దరు అధికారులు ఉన్నారు. స్కూల్లో 960 మంది విద్యార్థులను ఆర్మీ కాపాడింది. దాడి జరిగిన సమయంలో పాఠశాలలో 1100 మంది విద్యార్థులు, ఇతర సిబ్బంది ఉన్నారు. 

ఉగ్రవాదులు ఆయుధాలతోపాటు, ఆహారం కూడా తెచ్చుకొన్నారు. అంటే కొన్నాళ్లపాటు స్కూల్‌ను నిర్బంధించాలన్న లక్ష్యంతో వాళ్లు వచ్చినట్లు కనిపిస్తోంది. మిలిటెంట్లు ఎలాంటి డిమాండ్ చేయకపోవడాన్ని బట్టి చూస్తే ఎక్కువమందిని చంపడమే లక్ష్యంగా వచ్చారని అర్ధమవుతోంది. చాలామందిని తల, ఛాతీ భాగాల్లోనే కాల్చి చంపారంటే ఎవరూ బతకొద్దనేదే వాళ్ల ఉద్దేశం.


ప్రస్తుతం పెషావర్ సైనిక స్కూల్ శ్మశాన నిశ్శబ్దంతో రోదిస్తోంది! ఎక్కడ చూసినా గడ్డకట్టిన నెత్తుటి మడుగులు కనిపిస్తున్నాయి. బుల్లెట్ల ధాటికి పాఠశాల గోడలు ఛిద్రమయ్యాయి. అలుముకున్న చిక్కటి పొగ వాసనకు ఊపిరి ఆడటం లేదు! అక్కడక్కడా మాంసపు ముద్దలు భీతిగొలుపుతున్నాయి. పిల్లల యూనిఫాంలన్నీ నెత్తుట్లో ముంచి ఆరేసిన బట్టల్లా ఉన్నాయి! పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పెషావర్‌లోని అన్ని హాస్పిటళ్లు విద్యార్ధుల తల్లిదండ్రుల ఆర్తనాదాలతో నిండిపోయాయి. రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు యావత్ ప్రపంచం కన్నీటి నివాళులు అర్పించింది.

ఇంత దారుణంగా, పైచాశికంగా పిల్లల్ని చంపెస్తే వారి ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుందో అర్థం కాదు. పాకిస్తాన్ అంటేనే ప్రపంచ దేశాలకి "ఉగ్రవాదులు" అని గళం విప్పి చెప్పెస్తున్నట్టు ఉంది. ఐన మనిషిని మనిషిని ఎందుకు కాల్చుకోవలసి వస్తోందో, అసలు ఎందుకు మారణహోమం సృష్టిస్తున్నారో వారికే తెలియాలి. వాళ్ళకి వాళ్ళ పిల్లలపై కాస్త ప్రేమ ఉంటె ఇలా చేసేవారు కాదేమో. 

ఉగ్రవాదులకి ఇలా చేస్తే ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా ? ఇదంతా సమాజం పై విరక్తి కలిగి చేస్తున్న పని నా ? లేక ఏంటి?

తాలిబాన్ ఉగ్రవాదులు ఎందుకు ఇలా మారవలసి వచ్చింది? అసలు వాళ్ళు, వాళ్ళ సిద్దంతాలు ఏంటి? ఇంతలా  మారణహోమానికి ఓడిగాడుతున్నారంటే వారిని ఇలా పూరికొల్పే సిద్ధాంతలు  తప్పకనే ఉండి ఉంటాయి. ఈ సిద్దాంతాలను పురికొల్పే వారలారా కనీసం మీరు ఒక అమ్మ కడుపుకే పుట్టారని మారండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మారితే చాల మంచిదని నా అభిప్రాయం. 

ఒకరిని ఒకరు చంపుకుంటూ పోతే ఈ ప్రపంచం మొత్తం నాశనమై ఎవరు లేని ఒక శూన్యం అయి పోతుంది. ఎందుకని  మనల్ని మనం కాల్చుకోవడం? మనల్ని మనం ప్రేమించుకుందం. ఇకపై ఎన్నడు ఇలా చెయ్యరని నా కోరిక. 

రాజేష్ దుప్ట.  



















Saturday, December 6, 2014

వేచి చూడాల్సిన సమయం ఇది.

తెలంగాణా ప్రభుత్వం  260 కోట్ల రూపాయలు సిర్పూర్ నియోజక వర్గానికి ఇచ్చిందని, అననద పడిపోయం. సంబరాలు చేసుకున్నాం. సిర్పూర్ నియోజక వర్గ MLA  గౌ" శ్రీ " కోనేరు కోనప్ప చాల మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక గొప్ప లీడర్ అని మనందరికీ తెలిసిన విషయo.

సిర్పూర్ నియోజక వర్గ ప్రభుత్వ అధికారులు 260 కోట్ల రూపాయలను ఖర్చు చేసే విషయంలో ఎన్ని గ్రామాలకి, ఎన్ని సదుపాయాలు కల్పిస్తారోనన్నది ఇప్పుడు నాకు కలిగే ప్రశ్న. చాల గ్రామాల్లో నీటి సదుపాయం లేదు, రవాణ వ్యవస్థ సరిగ్గా లేదు. రోడ్లు అనిచ్చల స్తితిలో ఉన్నాయన్నది వాస్తవం, మనకి తెలిసిన, కనిపిస్తున్న వాస్తవం. మా స్వగ్రామం గంగాపూర్ లో ఇప్పటికి రోడ్డు వసతి లేదు. స్వతంత్రం వచ్చి మన దేశాన్ని మనం పరిపాలించుకుందాం అన్నది ఇలా పనులు చేయకుండా ఖాలిగా కూర్చోడానికి కాదు అన్నది నా అభిప్రాయం.

 నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా బాధ పడే విషయాల్లో రోడ్డు వ్యవస్థ గురించే. నేను నా 10th క్లాసు లో సిర్పూర్ (T) రెసిడెన్సియల్ స్కూల్ లో ,ఇంటర్మీడియాట్ సికింద్రాబాద్ లో, డిగ్రీ కర్నూల్ లోని సిల్వర్ జూబిలీ, మరియు  ఇప్పుడు యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో PG చదువుతున్నా, మా ఊరికి రోడ్డు ఉంటె బాగుంటుందని బాధ పడ్డాను. ఇది మా ఒక్క ఊరి సంగతి కాదు, ఇది చాల ఊర్ల సమస్యగా మిగిలిపోయింది.

మహబూబ్ నగర్ జిల్లా మొదటి వెనుకబడ్డ జిల్లాగా, ఆదిలాబాద్ రెండవ వెనుక బడ్డ జిల్లాగా జనాబా లెక్కల్లో చదివాను. మహబూబ్ నగర్ జిల్లా వాసులని మొరటు వాళ్ళని అనగా, ఆదిలాబాద్ జిల్లాని గోండు జిల్లా అని ఎగతాళి చేసేవారు నా డిగ్రీ చదివే రోజుల్లో. నేను పెరిగి పెద్దయ్యాక ఏదైనా చెయ్యాలని అనుకున్నాను. కానీ ఇప్పటికి చదువుకుంటూనే ఉన్నాను. మొన్న 260 కోట్ల రూపాయలు తెలంగాణా ప్రభుత్వం మన సిర్పూర్ నియోజక వర్గానికి కేటాయించారు అనే  న్యూస్ చదివాకా చాల హ్యాపీ గా ఫీల్  అయ్యాను నేను. ఫీల్ అయితే అయ్యాను కానీ ఎంత వరకు మన నియోజక వర్గ అధికారులు దీనికి న్యాయం చేస్తారో అన్నది వేచి చూడాల్సిన సమయo.

మీ కామెంట్స్ పంపండి..... షేర్ చేయండి.......


Wednesday, November 12, 2014

Kiss of Love

కిస్ అఫ్ లవ్ 



"కిస్ అఫ్ లవ్" అనేది నైతిక  విధానాలకి వ్యతిరేకంగా అహింస పూర్వకముగా చేపట్టిన నిరసన కార్యక్రమం. ఇది మొదట కేరళ లో మొదలై మెల్ల మెల్లగా భారత దేశాల్లోని మిగతా ప్రాంతాలకి వ్యాపించింది. "కిస్ అఫ్ లవ్"  అనే ఫేస్ బుక్ పేజి ద్వార నవంబర్ 2 తేది రోజున మెరైన్ డ్రైవ్, కొచ్చిన్ ప్రదేశంలో వచ్చి నైతిక విధానాలకి వ్యతిరేకంగా ఒకరి నొకరు ముద్దులు, కౌగిలింతలతో నిరసన చేపట్టడమే దీని ముఖ్య ఉద్యేశము. ఈ ఫేస్ బుక్ పేజి ఎంత వరకు పాపులర్ అయిందంటే ప్రపంచ వ్యాప్తంగా 120000 మంది ఈ పేజి ని లైక్ చేసారు.  మొదటగా ఇది కేరళ లోని కొచ్చిలో మొదలై  హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలకి వ్యాప్తి చెందింది.  ఇది స్వేచ్చ ప్రియులకి అమోదయోగ్యంగా ఉన్నా, దిన్ని వ్యతిరేకించే వారు చాల మంది ఉన్నారు. భారతీయ జనత యువ మోర్చా, SDPI, విశ్వ హిందు పరిషత్, శివ సేన, బజరంగ్ దళ్ , హిందు సేన మరియు ఎర్నాకులం వింగ్ అఫ్ కేరళ స్టూడెంట్స్ యూనియన్ వారు దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. 





ఇక్కడ సమస్య చిన్న విషయం పట్ల ఐన ఇరు ప్రక్క వాదాలలో ఎవరికీ వారే భిన్నఅభిప్రాయాలను కలిగి ఉన్నారు. కిస్ అనేది ఇతరులపై  మన ఇష్టాన్ని చూపించే ఒక చిహ్నం అని కొంతమంది వాదన అయితే,  మన సంస్కృతి కి వ్యతిరేకమైనదని మరి కొంత మంది వాదన. నైతిక విధానాలని వ్యతిరేకించడం అనేది సమాజంలో మార్పుని తీసుకు వస్తుందా ? లేదా ? అనేది ప్రస్తుతం అందరి నోళ్ళలో మెదలు తున్న ఒక ప్రశ్న. 

అయితే భిన్నబిప్రయలు ఉన్న ప్రస్తుత నేపత్యంలో  యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో ఈ విషయం దుమారాన్నే లేపింది. కొంతమంది కేరళ విద్యార్థులు కలిసి దీన్ని ఒక కార్య క్రమంగా తెరపై తీసుకు వచ్చారు. అయితే యూనివర్సిటీ విద్యార్ధి సంఘాల్లో ABVP, ASA,మరియు  BJYM దీనికి పూర్తిగా వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.


                                                                          యూనివర్సిటీ లో చేపట్టిన కార్యక్రమం 

"సమాజంలో మార్పుని తీసుకు వచ్చే దిశలో ఈ ఉద్యమాన్ని చేపట్టాము. స్త్రీలు ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడంలో తప్పు ఏముంది ? ఒక అబ్బాయిని లేదా సన్నిహితులను ఎక్కడ ముద్దు పెట్టుకుంటే ఏంటి? దాన్ని సెక్స్ కి లింక్ చేసి ఎందుకు చూస్తున్నారు. హిందు దేవాలయాల పై చిత్ర లేఖనల్లో చుడండి నగ్నంగా చెక్కిన శిల్పాలు ఎన్ని ఉన్నాయో ?"  అని యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్  లోని ఒక అమ్మాయి వాదన.  

" ఇది భారతీయ సంస్క్రతి కి పూర్తిగా విరుద్దమైన చర్య, నైతిక విదానాలను వ్యతిరేకించడం అనేది తప్పు. ఏ పని చేయాలన్న కొన్ని హద్దులు, పరిమితులకి  లోబడి చెయ్యాలి. " అని కిస్ అఫ్ లవ్ వ్యతిరేఖుల అభిప్రాయం. 

బ్రిటన్ లాంటి  ప్రచాత్య దేశాలలో 100 సంవత్సరాల ముందు  నైతిక విధానాలు అనేవి వ్యక్తి యొక్క స్వేచ్చను హరిస్తున్నాయని స్వేచ యుత మైన జీవనం కోసం  ఉద్యమాలు జరిగాయి. అయితే ఈ ఉద్యమాల ప్రభావంతో స్త్రీ జాతి అనేది కొంత ఉపశమనాన్ని పొందింది అని చెప్పొచ్చు.  ప్రస్తుత హిందు సమాజంలో స్త్రీ అంటే ఒక చిన్న చూపు. స్త్రీ మగవాడి కంటే తక్కువ అని అబిప్రాయాలు ఉన్నాయి.

"ఒరేయ్ నువ్వు మగవాడివి నువ్విలా  ఉండాలి, ఒసేయ్ నువ్వు అమ్మాయివి నువ్విలా  ఉండాలని చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్నలు పెంచారే తప్ప ఇక్కడ స్త్రీ పురుషులు అందరు సమానమే" అనేది వాదన లో ఒక చిన్న ప్రయత్నం.

నైతిక విధానాలు మనిషిని స్వేచ్చ జీవితంలో నుండి బంధకల్లో ఉంచుతున్నాయని చాల మంది అమ్మాయిల అభిప్రాయం. అయితే ఇక్కడ నైతిక విధానాలని ఉల్లంగిద్దమా ? అంటే అది సరి ఐనది కాదు. ఒక వేళా ఉల్లంగిస్తే ఎన్నో తప్పులు జరగవచ్చు. ఎన్ని నేరాలు జరుగుతాయో చెప్పలేము.

నా అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం చేపట్టిన ఈ ఉద్యమం, ఒక వైపు  బంధకల్లో నుంచి విముక్తిని కలిగించినా, మన లాంటి సంస్క్రతిక విలువలు కలిగిన దేశంలో ఇది కొన్నాళ్ళ వరకు సమస్యగానే ఉండి పోతుంది. యూనివర్సిటీ పరిధి లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిదే అయితే దీని ప్రభావం బయట చాల సమస్యాలను తెచ్చి పెడుతుంది. యూనివర్సిటీ లో చదువుకునే స్టూడెంట్స్ కి విస్తృత జ్ఞానం, స్త్రీని మనలో ఒకరిగా చూసే విదానం కలిగి ఉండటం వాళ్ళ ఈ సమస్య ఇక్కడ చాల చిన్నదిగా ఉన్నా, గ్రామాల్లో ఇది చాల ప్రమాదకరం. ఎందుకంటే గ్రామాల్లో నిరక్స్యరాసులు చాల మంది ఉన్నారు. వాళ్ళకి సరైన అభిప్రాయాలూ ఉండవు.

ఒక సరి వెళ్లి గ్రామాల్లో కులాల గురించి అడగండి తెలుస్తుంది మీకే, నేను వెళ్లి నాన్న నాన్న నేను వేరే కులం లో ఉన్న అమ్మయిని పెళ్లి చేసు కుంటాను అంటే మా నాన్న చేతిలో నాకు దెబ్బలు తప్పవు. ఎందుకంటే మన పెద్దలు చిన్నప్పటి నుంచి మనకి నేర్పించిన విధానాల్లో మనమంతా కూరుకుపోయి ఉన్నాము. అదే కిస్ అఫ్ లవ్ లో మా చెల్లి వెళ్లి నాకు ఇష్టమైన వాడిని నేను ముద్దు పెట్టుకుంటాను అంటే నేను తనని ఏమి అనకపోవచ్చు కాని మా అమ్మ నాన్నలు మాత్రం తనని చితక భాదుతరనేది వాస్తవం. ఆమె ఏ ఉద్యేశంతో అలా చేస్తుందో నేను అర్థం చేసుకోవచ్చేమో కానీ మా అమ్మా-నాన్నలు మాత్రం అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మనకి తెలిసింది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసిన జ్ఞానం మనకి తెలియదు. మన సమాజం అంత విద్యావంతులు అవ్వాలి అప్పుడే ఇలాంటి వాటిని మనం అర్థం చేసుకోగలం.

అయితే ప్రస్తుతం  నేను దీనికి పూర్తిగా వ్యతిరేక వాదిని కాను అలాగే సమంజస వాదిని కాను. అయితే నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఏది ఎక్కడ చేయాలో, ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తేనే మంచిది. 10 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసు కుంటాను అంటే ఎలా అవుతుంది చెప్పండి, దానికంటూ ఒక సమయం, సందర్భం  ఉంటుంది కదా.
                                                                                  ఒక ఉదాహరణ -క్రికెట్ బౌండరీ 

ఒక క్రికెట్ పిత్చ్ లో  బౌండరీ లేకుండా క్రికెట్ ఆడగలమా చెప్పండి. ఒక వేళా క్రికెట్ ఆడిన అది క్రికెట్ ఆటనే అవుతుంది కాని అందులో సంతోషం ఉండదు. ఎందుకంటే నీకు ఫోర్ ఏదో సిక్స్ ఏదో తెలిపేది నీవు గీసుకున్న బౌండరీ పై ఆధారపడి ఉంటుంది. ఆటగాడు కొట్టిన బంతి బౌండరీ బయట పడితే దాన్ని సిక్స్ అనో లేక ఫోర్ అనో విధానాలు ఉంటాయి. చప్పట్లు కేరింతలు కొట్టగలం. ఇలా విధానాలు ఉంటేనే అది ఆట. అలాగే మన జీవితంలో కొన్ని విధానాలు ఉంటేనే అది  ఒక మంచి జీవితం గా రూపుదిద్దుతుంది అనేది నా అబిప్రాయం.  

మీ అభిప్రాయలను కామెంట్ బాక్స్ లో రాయండి.....
















Thursday, October 23, 2014

ఆనందోత్సాహం లో... మేము...

                                                                                                                  దేవుణ్ణి స్తుతిస్తున్న విద్యార్థులు 

యూనివర్సిటీ నుంఛి మా ప్రయాణం ఉదయం 9:00 గంటలకి బొటనికల్ గార్డెన్ వైపు మొదలైంది. దాదాపు 30 మందితో క్యాంపు ఉల్లసబరితంగా ఉంది. గత దినమంతా మమ్మల్ని కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ రోజు జరిగే వన్ డే రెట్రిట్ గురించి మా మనస్సులో ప్రార్థిస్తూ బయలుదేరాము.

                                                                                                       మనోహర్ పాల్ అన్న ఆత్మీయ ఆహారాన్ని వడ్డిస్తున్న తీరు. 

మా ఒకరోజు రిట్రిట్ ఒక చిన్న ప్రార్థనతో మొదలైంది. తరవాత కొన్ని పాటలు పడుతూ దేవుణ్ణి స్తుతించాము. తమ్ముడు రవి కిరణ్ ఆక్టివిటి మమ్మల్ని ఎంతో ఆనందిపసేసింది. తరవాత మనోహర్ పాల్ అన్న మెసేజ్ మా హృదయాలను ఆకట్టుకునేల ఉంది. సహవాసంలో ఉండాల్సిన ముఖ్యమైన 3 విషయాల గురించి అన్న మాట్లాడాడు. అప్పటికి మధ్యాహ్నం 1:00 గంట దాటిపాయింది. ఐన తినవలసిన శారీరక ఆహారం రాలేదు, అందుకు మనోహర్ పాల్ అన్నని రిక్వెస్ట్ చేస్తే ఆత్మీయ ఆహారాన్ని మళ్ళి ఇంకోసారి వడ్డించాడు. మాకైతే అనిపించింది ఆత్మీయ ఆహారం చాల బాగుందని.  ఈ లోపు శారీరక ఆహారం రానే వచ్చింది. రాదా మరి ఆత్మీయ ఆహారం తిన్న వెంటనే మన దేవుడు శారీరక ఆహారం కూడా ఇస్తాడు కదా. జాన్ వెస్లీ అన్నయ కో - ఆర్డినేషన్ లో ఈ సరి తిన్న బిర్యానీ చాల బాగుంది. దేవునికి వందనాలు ఎందుకంటే HCU-EU లో మా ప్రతి అవసరతను గుర్తిస్తూ తీరుస్తున్నందుకు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య. 
                                                                                                                      శారీరక ఆహారం ఇది

 మళ్ళి ఒక అక్టివిటి తో మాకు నవ్వులు తెప్పించాడు తమ్ముడు రవి కిరణ్. నిజంగా యేసు క్రీస్తు ప్రభువు లో దొరికే ఆనందం బహుశ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే అది అనుభవించిన వారికీ మాత్రమే తెలుస్తుంది. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టిన ఒక మంచి కాపరి. నువ్వు బాధలో ఉంటె దగ్గరికి తీసుకునే ఒక మంచి స్నేహితుడు యేసయ్య. నువ్వు పాపపు స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పాపము నుంచి విడిపించిన రక్షకుడు అయన. ఈ రోజు ఈ బ్లాగ్ చదువుతున్న ప్రియ తమ్ముడు, చెల్లి యేసయ్య నీ కోసము తన రక్తాన్ని సిలువలో నీ కోసం, నా కోసం కార్చాడు అన్న సంగతిని మరచిపోకు. ఈ రోజు నువ్వు యేసయ్య ను నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తే నీ జీవితంలో ఎన్నడు లేని సంతోషాన్ని పొందుకుంటావు.నిజంగా మాకు ఈ రోజు అక్టివిటి ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే అది మాటల్లో చెప్పలేము. 
                                                                                                                   అక్టివిటి లో అనదోత్సాహం...
 
అక్టివిటి ఐన వెంటనే ప్రాక్టికల్ టాక్ బ్రదర్. కిషోర్ అన్న తీసుకున్నాడు. క్యాంపస్ లో సాక్ష్య జీవితము లేవనేత్తాలి. మన స్టడీస్, మన వ్యక్తిగత జీవితం, మన సామజిక జీవితం పట్ల చాల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా  మన వ్యక్తిగత జీవితాలలో ప్రభువుకి మొదటి స్థానము ఇచ్చి మన స్టడీస్ విషయంలోకాస్త శ్రద్ద కలిగి ఉంటె సాక్ష్యాన్ని లేవనెత్తే బిడ్డలుగా ఉంటామని చెప్పారు. 

                                                                                                                     ప్రాక్టికల్ టాక్ లో బ్రదర్. కిషోర్ దాసరి.

ప్రాక్టికల్ టాక్ అవ్వగానే కమలకుమారి అక్కయ మాకు చివరి సందేశాన్ని ఇచ్చారు. అక్కయ ఇచ్చిన సందేశం మాకు చాల ఉపయోగకరంగా ఉందనిపించింది. మన జీవితంలో మన విషయాల్లో ఎన్నో సార్లు ఒకరి పట్ల ఒకరికి భేదాబిప్రాయలు ఉన్నప్పటికీ మనమంతా యేసయ్య బిడ్డలమని, మనల్ని మనం తగ్గించుకుని ఉంటె సహవాసంలో ఎంతో ఎంజాయ్ చేయగలమని చెప్పారు. చివరిగా ప్రార్థనతో మా ఒక రోజు రిట్రిట్ ముగిసిపోయింది..
                                                                                           కమల కుమారి అక్కయ చివరి ప్రార్థన తో ముగిసిన ఒక రోజు రిట్రిట్ 


తమ్ముడు, చెల్లి ఈ రోజు ఈ బ్లాగ్ చదువుతున్న నువ్వు నీ సహవాసం విషయంలోనేమి, నీ సాక్ష్య జీవితం విషయంలోనేమి కానీ తగిన జగ్రత్తగా  లేకపోతే అది దేవుని మహిమకు ఆటంకాన్ని తీసుకు వస్తుంది అని మరచి పోకు. నువ్వు ఒక వేళా యేసయ్య ను స్వంత రక్షకునిగా అంగీకరించని పక్షన ఉంటె ఈ రోజు యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు ఉన్న చోటే ప్రార్థన చెయ్. దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప పనులను చేయబోతున్నడనే ఒక గొప్ప సంగతిని గుర్తేరుగు. నువ్వు ఒక వేళా యేసయ్య ను అంగికరించి ఉంటె, ఇది నీకు మంచి సమయం నీవు పొందుకున్న ఆనందాన్ని ఇతరులకు ఇవ్వు.  













Wednesday, September 17, 2014

Follow-Up




ఫాలో అప్ అంటే ఏంటి ?
ఫాలో అప్ అనేది కమ్యూనికేషన్ తో ముడిపడి ఉన్న ఒక పదం. ఈనాటి సమకాలిన జీవన ప్రంపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా జనులను ప్రభావితం చేసే అంశాల్లో ఫాలో-అప్ ఒకటి అని చెప్పవచ్చు. కొంత మంది వ్యక్తుల దగ్గర ఉన్న వర్తమానాన్ని వినగలిగే వారికీ సరైన మార్గంలో అనుసందించే క్రమంలో చేసే ఒక  పనిని ఫాలో- అప్ అని పిలవవచ్చు. రోజు గొప్ప గొప్ప ప్రాసంగికులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులూ అతి ఎక్కువగా దృష్టి పెట్టె అంశాల్లో ఫాలో-అప్ ఒకటి. దిన్ని ఎంత  ఎక్కువగా చేస్తే అంత మందిని మనం రీచ్ అవుతామని గొప్ప వ్యక్తులకి తెలిసిన నిఘుడమైన  సత్యం.

ఫాలో అప్ ఎందుకు చేయాలి ?
ఈనాటి మన విద్యార్ధి జీవన విదానంలో ప్రశాత్య దేశాల నుంచి వచ్చే ట్రెండ్స్ కి యువత లోనై పోతున్న తరుణమిది. నశించి పోతున్న ఆత్మలు వేల కొలదిగ, లక్షలకొలదిగ ఉన్నాయి , పని వారు చాల తక్కువ మంది ఉన్నారు. నశించి పోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఫాలో అప్ చేయాల్సిందే.  యేసు క్రీస్తును విశ్వసించిన నీవు నేను రోజు ఫాలో చేసే విషయంలో సరైన జాగ్రతలు తీసుకోకపోతే యువతను మన చేతులారా మనమే సాతాను చేతికి అప్పగించే వారిగా ఉంటాము. ఒక విద్యార్ధి జీవితంలో చాల కీలకమైన పాత్ర నిర్వహించేది, విద్యార్థిని సరైన విధంగా నడిపించే దశలో ఫాలో అప్ తోడ్పడ్తుంది
"మీరు ఫాలో అప్ విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యము గా వ్యవహరిస్తారో రోజు జరగబోయే క్యాంపు లో మీరు నూతనంగా క్రీస్తు సారూప్యం లోకి మారబోయే వ్యక్తులను చూడలేరు, మీరు కేవలం అక్కడికి వచ్చిన గ్రాడుయేట్స్ ని, సేనియర్ స్టూడెంట్స్ ని మాత్రమే చూస్తారు. క్రిస్తుకి కావాల్సింది మార బోతున్న ఆత్మలు కానీ మారిన ఆత్మలు కావు " అని సెంట్రల్ యూనివర్సిటీ లో ఉన్న ఒక  గ్రాడుయేట్ అంటారు.
ఫాలో అప్ ఎలా చేయాలి :
కమ్యూనికేషన్ లో భాగంగా ఫాలో-అప్ ని 5 విధాలుగా చేయవచ్చు.
1. ఇంట్ర పర్సనల్ కమ్యూనికేషన్
2. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్
3. ప్రింట్ కమ్యూనికేషన్
4.టీవీ అండ్ రేడియో కమ్యూనికేషన్
5.ఇంటర్నెట్

ఇంట్ర పర్సనల్ కమ్యూనికేషన్ లో భాగంగా మన వాయిస్ తో గట్టిగ అరచి చెప్పడం తో లేదా లౌడ్ స్పీకర్స్ తో చెప్పడం కానీ జరుగుతుంది. ఇలా చెప్పడంవల్ల ఎదుటి వ్యక్తికి ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో దాని గురించి తెలుస్తుంది. దీని ద్వార స్టూడెంట్స్ ని రీచ్ అవ్వడానికి వీలు కలుగుతుంది.

ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ లో గట్టిగ అరచి చెప్పడానికి వీలు ఉండదు కానీ ఒక వ్యక్తిని ఒక నిర్ణిత సమయంలో అతనికి సమయం కల్పించి అతనితో ముఖముఖిగా మాట్లాడానికి వీలు కలుగుతుంది. ఇక్కడ   కనుక మనము సరైన రీతిలో ఒక వ్యక్తి కోసం సమయం కేటాయించి, వ్యక్తి తో సంభాషించి ఇన్విటేషన్ ఇచ్చి పిలిస్తే  అవతలి వ్యక్తి త్వరగా, నమ్మకంగా వచ్చే అవకాశము ఉంటుంది. చాల మంది ఫాలో అవుతున్న మార్గాల్లో ఇది ఒకటి.

ప్రింట్ విషయానికి వస్తే ఇది చాల తక్కువ ఖర్చుతో కూడుకున్నది. చాల సులభతరంగా  ఒక వ్యక్తిని ఫాలో అప్ చేయడానికి వీలు కల్పించేది అని చెప్పవచ్చు . ఇక్కడ మనం ఒక విద్యార్థిని పోస్టర్స్ ద్వార కానీ, మాగజిన్ ద్వార కానీ, కర పత్రిక ద్వార కానీ మరియు  న్యూస్ పేపర్స్ స్టేట్మెంట్స్ ద్వార కానీ ఫాలో అప్ చేయవచ్చు.దీనికి మనకి పోస్టర్ డిసైనింగ్ వచ్చి ఉండాలి. దీని ద్వార అవతలి వ్యక్తికి విషయంలో ఫాలో అప్ చేస్తున్నామో ఆ  విషయం పట్ల చూడడానికి మాత్రమే వీలు కలుగుతుంది.

రేడియో అండ్ వీడియో కమ్యూనికేషన్ విషయానికి వస్తే రోజు ప్రపంచ దేశాలన్నీ ఒక మోస్తరు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఒక విషయాన్నీ గురించిన పూర్తి సమాచారాన్ని వినే విషయంలో రేడియో ఉపకరిస్తే అదే విసయాన్ని దృశ్య రూపంలో అలాగే శ్రవణ రూపంలో అందించే ఏకైక సాధనము టెలివిషన్. దిని ద్వార నిమిషం పాటు వ్యవదిలో  చూస్తున్న లేదా వింటున్న వారికి తగిన విషయాన్నీ అందించవచ్చు. రోజుల్లో ఇది ఎక్కువగా సువార్త చానల్స్ లో చూస్తాము.

ఇంటర్నెట్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే మన దేశంలో దిని వాడకం తక్కువే ఐన రోజుల్లో సెల్ ఫోన్స్ లలో కూడా వ్హట్స్ అప్, ఫేస్ బుక్  లాంటి  సోషల్ సైట్స్  ఉండడం వాళ్ళ , దీనితో కూడా ఫాలో అప్  చక్కగా చేసుకోవడానికి వీలు ఉంది.

ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి రోజు నువ్వు కనుక ఫాలో అప్ విషయంలో సరైన రీతిలో లేకపోతే అయ్యో అది మనకు శ్రమ. మనపై దేవుడు పెట్టిన బాద్యతను సక్రమంగా నిర్వర్తించక పోతే అది మన జీవితాలకు సరైన అర్థాన్ని ఇవ్వక పోగా సాతాను చేతుల్లో విద్యార్థిని పెట్టిన వారిగా ఉంటావు. నువ్వు సరిగ్గా ఫాలో అప్ చేయకపోవడం వల్లే నీ ఫ్రెండ్ ని, క్లాసుమేట్ ని నరకం లో చూస్తావు. ఫాలో అప్ చేసే విషయాల్లో సరైన అవగాహనా లేకపోతే గ్రాడ్యుయేట్ ని అడిగి తెలుసుకోవడం మంచిది.

నువ్వు ఫాలో అప్ చేసే విషయంలో నీకు మాటలు రాకపోతే చింత పడకు, మోసే లాంటి లీడర్ కి మాటలు రాకున్న దేవుడు సహాయాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుదాం, ఫాలో అప్ చేద్దాము. దేవుని రాజ్యంలో మనమంతా కలిసి ఉందాం.